ఆధునిక విజ్ఞానశాస్త్రం ఎన్నో కొత్తపుంతలు తొక్కుతోంది. నిన్నటి తరంవారు కలలో కూడా చూడని ఎన్నో వింతలు, విశేషాలు నేడు మన ఇంట్లో ప్రత్యక్ష మౌతున్నాయి. వాటితో మనం ఎన్నో ఉపయోగాలనీ, మరెంతో ఆనందాన్నీ పొందుతున్నా మనేది నిజం. కానీ ఆనందం తెరవెనుక ఎన్నో విషాదపొరలు కూడా ఉన్నాయనేది నిజం. నేటి సమాజంలో అనేక రకాల వ్యాధులు మనల్ని నిత్యం పలకరిస్తునానయన్నది అతిశయోక్తి కాదు. ఈనాడు నిత్యం మన ఒంట్లో, ఇంట్లో, చుట్టూ సమాజంలో కనిపించే రుగ్మతలని ఒకసారి లోతుగా సునిశితంగా గమనిస్తే రోజు రోజుకీ అధికమౌతునన& గుండె జబ్బులు, బి.పి., షుగరు, ఆస్తామ్మ, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు, సోరియాసిస్‌ లాంటి చర్మవ్యాధులు, అధికబరువు, రకరకాల కాన్సర్‌లు, కడుపులో అల్సర్లు, మానసిక అశాంతి, ఇంకా శరీరాన్ని అంతా స్కానించే చేసినా అంతు చిక్కని ఎన్నో వ్యాధులు, రిపోర్టులన్నీ నార్మల్‌గా ఉన్నా తగ్గని నీరసాలు, ఇలాంటివన్ని మనల్ని, మన ఆధునిక శస్త్ర పరిశోధనలని వెక్కిరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. గుండెను తీసి గుండెను మార్పిడి చేస్తున్న ఈ రోజుల్లో అంగారకుడికి సైతం రోబోలని పంపుతున్న ఈ రోజుల్లో చంద్రమండలం మీద స్థలానికి రద్దీ పెరుగుతున్న ఈ రోజుల్లో... గతంలో కంటే ఎక్కువగా వింత వింత రూపాలలో రోగాలు రావటం అతి చిన్న వయస్సులోనే వాటి బారినపడటం, మందులు వాడినా ఆహార విహారాల్లో మార్పులు చేసినా, నిత్యం డాక్టర్ల చుట్టూ తిరిగినా, జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితులు రావడం దురదృష్టమే.

సరిగ్గా ఇదే సమయంలో మనం 'యోగ' గురించి తెలుసుకోవాలి. తప్పనిసరిగా తెలుసుకోవలసిన అవసరం కూడా ఉంది. ప్రపంచంలోని అన్ని విధానాలలో కంటే ఇంకా చెప్పాలంటే వైద్య విధానాలన్నింటికంటే కూడా యోగ మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి చక్కగా సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉంది. ఎప్పుడో 5 వేల సంవత్సరాలకి పూర్వమే మన సంస్కృతి నాగరికతల్లో భాగమైన యోగ ఈ నాటికీ నిత్యమై నేటి సమస్యలని కూడా పరిష్కరించగలగడం, యోగ ఇన్ని సంవత్సరాల కాలాన్ని తట్టుకుని నిలబడడం చాలా అద్భుతమైన విషయంగానే చెప్పుకోవచ్చు.

Pages : 47

Write a review

Note: HTML is not translated!
Bad           Good