ప్రపంచం అంతటా ఈనాడు ఎన్నో మిలియన్ల మంది ధ్యాన పద్ధతుల్ని అనుసరిస్తున్నారు. మత విశ్వాసాలకి, సంస్కృతి విభేధాలకి అతీతంగా ఆదరింపబడుతున్న ధ్యానపద్ధతుల ఇతివృత్తం ఏమిటి?
ఆధునిక జీవితంలోని ఒత్తిడి వల్లనే 70-80 శాతం వ్యాధులు వస్తున్నాయని వైద్య నిపుణులు వక్కాణిస్తున్నారు. ఒత్తిడి ప్రతిస్పందనకి వ్యతిరేకమూ, ఉన్నతమూ అయిన విశ్రాంతి ప్రతిస్పందన ధ్యానం వల్ల కలుగుతుందనీ, వ్యక్తుల ఆరోగ్యం, సమర్థత ధ్యానం వల్ల వృత్ధి చెందుతాయనీ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఎంతో మంది వైద్యులు, సైకాలజిస్టులు తమ చికిత్సా విధానాల్లో ధ్యానపద్ధతుల్ని ఉపయోగిస్తున్నారు.
అయితే ఈ ధ్యాన పద్ధతుల సిద్ధాంత ప్రాతిపదిక ఏమిటి. వాటిని అనుసరించడం ఎలా? ఈ విషయాల్ని సమగ్రంగా చర్చించిన పుస్తకాలు తెలుగులో లేవు.
శాస్త్రీయంగా మనోవైజ్ఞానిక ధృక్పధంలో ధ్యానాన్ని విశ్లేషించి విశ్వాసాలకి వ్యక్తి పూజలకి అతీతంగా ధ్యానాన్ని వివరించిన తొలి తెలుగు పుస్తకం ఇది. మిమ్ముల్ని మీరు అర్ధం చేసుకోవటానికి, అదుపులో ఉంచుకోవటానికి ఉత్కృష్టమైన సాధనం ధ్యానం. ధ్యాన పద్ధతుల్ని వవరించటంతోపాటు మీరు సొంతంగా ధ్యానం నేర్చుకునేందుకు వీలుగా రూపొందించబడ్డ మాన్యువల్‌ ఈ  పుస్తకం.
ఆంధ్రా యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ యోగ & కాన్షియస్‌నెస్‌ డైరెక్టర్‌, ''నిత్యజీవితంలో ఒత్తిడి-నివారణ'' రచయిత డా|| పి.వి.కృష్ణారావు పాఠకులకు అందిస్తున్న మరో వైజ్ఞానిక  సాహిత్యదీపిక ''ధ్యానం''. చదవండి!!

Write a review

Note: HTML is not translated!
Bad           Good