శొంఠి, అతిమధురము, వీటి చూర్ణములో, తిల తైలము, శర్కర, పెరుగు, ఇవి సమభాగములుగ చేర్చి చిలికి, స్త్రీభక్షించెనేని వాతప్రదరరోగము నివర్తియగు.

 ఏలకులు, ముయ్యాకుపొన్న, ద్రాక్ష, వట్టివేళ్లు, కటుకరోహిణి, చందనము, నల్లపుప్పు, సుంగథపాలవేళ్లు, లొద్దుగపట్ట, వీటిని సమముగా నూరి పెరుగులోకల్కము చేసి, స్త్రీ పుచ్చుకొనిన, వాత ప్రదరము మానును.

 పసుపు, నలుపు, యెరుపు, ఈ వర్ణములుగలదిగను, ఉష్ణముగను, పిత్తవేదనగలదిగను అతివేగము గలదిగనుండెనేని, నది పిత్త ప్రదరమని యెరుంగవలయు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good