ఏతద్విరచిత మగునీ రాజమార్తాండమున ముప్పది నాలుగధికారములుగా, నన్నూటపదు నెనిమిది శ్లోకములలో సకల రోగంబులకు నల్పమాల్యసాధ్యములు, నతిఫలదాయకములగు యోగములు చెప్పబడి యున్నవి. ఇందలి యోగంబుల లన్నియు ననుభవసిద్ధములును బ్రత్యక్ష ఫలదాయకము లగునని యీ గ్రంథమును పరిశీలించినవారికి దల్లము కాకపోదు. ఇందలి కవిత్వము మృదుమధుర పద ఘటితంబై చదువువారికి నోరూరజేయు చుండును. ఒకమాఱు చదివిన శ్లోకము సులువుగా కంఠస్థమగును.

Write a review

Note: HTML is not translated!
Bad           Good