ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక రకాలు భావావేశాలకు, ఒత్తిడులకు, పనుల తొందరలకు, లోనై టెన్షన్ కు గురవుతున్నారు ఫలితంగా శారీకంగా , మానసికంగా , అనేక రోగాల బారిన పడి బాధలు పడుతున్నారు. సులభంగా ఉపశమనం పొందే మార్గాలకు బదులు వందలూ, వేలూ, రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆరోగ్య నష్టం , ధననష్టం , అనుభవిస్తున్నారు. కొన్ని రకాల మందులు, సరిపడక రియాక్షన్లు , సైడ్ ఎఫెక్టులు, కల్గించి అసలు రోగాన్ని మరుగుపర్చి కొత్త కొత్త రోగాలను తెచ్చి పెట్టుకుంటున్నారు. ఈ యంత్రికయుగంలో ఇది ఒక విషవలయం.
ఈ విపరీతాల నుండి బయట పడడానికి యోగం, యోగాసనాలు, ధ్యానం, నిరపాయకరమైన సులభ సాధనాలని, సంప్రదాయవాదులు, ఆధునిక వైద్యులు కూడా చేబుతున్నారు.
ప్రాణయామసాదనను సులభ పద్దతులలో సామాన్యులకు బోధించి, వారికి ఆరోగ్యాన్ని రోగ నివారణను, ఆధ్యాత్మిక ఉన్నతిని పంచి పెడుతున్న ఈ గురు పరంపరను అభినందనం చేసి కొన్ని ముఖ్య అంశాలను చెప్పుకుందాం! 

Write a review

Note: HTML is not translated!
Bad           Good