హర విలాసము

సిరియాళ చరిత్ర

''నిరంజనా! నిరంజనా!...అబ్బా, ఇందాక ఇక్కడే ఉన్న వీడింతలోనే ఎక్కడ మాయమయ్యాడో కదా!''

తన మిత్రుడైన నిరంజనుడు కనబడకపోయేసరికి కపింజలుడు చాల చిరాకు చెందాడు. ఇద్దరూ దుర్వాస మహాముని శిష్యులు. అతని సేవచేస్తూ, ఇరువురూ బదరికాశ్రమములో గురువు గారితోనే నివసిస్తున్నారు.

మధ్యాహ్నా కాలం - సూర్యుని కిరణములచే వేడిమి భరించేందుకు వీలు కాకుండా ఉంది. మేతకు పోయినవి పోగా మిగిలిన పక్షులు ఎండ తాపాన్ని భరించలేక తమ కులాయాల్లో పండుకొని నిద్రిస్తున్నాయి. చలికాలములో హితమైన ఎండ, ఆ వేసగిలో సర్వప్రాణులకు దుర్భరమై ''అబ్బా, పాడు ఎండ'' అనిపించుకొనింది.

''వీడెక్కడికి వెళ్ళాడో చెప్మా. ఇప్పుడే జరిగిన ఒక వింత సంగతిని చెబుతామంటే నిరంజను డెక్కడ చచ్చాడో'' అంటూ కపింజలుడు కొంతవడి ఆ పొద ఈ పొద - ఆ చోటు ఈ చోటు - వెదకి, తుదకు, ''ఆ, వీడు గురువుగారి గుడ్డల నుతికికొని వచ్చేందుకు నదికి పోయి ఉంటాడులె''మ్మని గ్రహించిన వానివలె కపింజలుడు సమీపమున ప్రవహిస్తూ ఉండిన భవానీనది వైపు బిర బిర నడచి వెళ్ళాడు.....

Write a review

Note: HTML is not translated!
Bad           Good