ఆమె పేరు సుమతి... 
మొదటి రాత్రి గదిలోకి రాగానే భర్త "నీకు తెలుసుగా ఈ పెళ్ళి లోకం కోసమే... నువ్వు  పరంధామ్ గారి కోడలిగా ఆస్తినీ అంతస్తునీ అనుభవించు. డోంట్ ఎక్స్ పెక్ట్ మోర్ దెన్ ఇట్" అని తన  ప్రియురాలి దగ్గరకు వెళ్ళి పోయాడు.
అలనాటి సతీ సుమతి కుష్టు రోగి అయిన భర్తని బుట్టలో పెట్టుకొని అతని కోరిక తీర్చడానికి వేశ్య దగ్గరకి మోసుకేల్లింది. మరి ఈ నాటి ఈ సుమతి ఏం చేసిందీ?
ఇంకొకామె అనసూయ...
భర్త వ్యాపారానికి శరీరాన్ని పెట్టుబడిగా పెట్టమంటే ఎదిరించి తన దారి తాను చూసుకుంది. ఏం చేసిందీ ఈ ఆధునిక అనసూయ? త్రిమూర్తులను పసిపాపలుగా మార్చగలిగిందా?
మరొక ఆమె అహల్య...
చేయని తప్పుకి ఎన్నో వత్సరాలు జీవిత ఖైదు అనుభవించింది. రాయిగా మారి రామపాదం  కోసం ఎదురుచూసిందా? లేక స్త్రీ సహనరూపిణే కాదు శక్తి స్వరూపిణి అని నిరూపించిందా? విశృంఖలం అంటే... శృంఖాలాలు తెంచుకోవడమా?...
ఎవరు హద్దులు దాటినా సమరం అనివార్యం అంటూ వైవాహిక వ్యవస్థ మీద సంధించిన అక్షరసమరం "హద్దులున్నాయి జాగ్రత్త".

Write a review

Note: HTML is not translated!
Bad           Good