''హాస్యజ్యోతి'' అనే పదబంధంలో హాస్యం మొదటి మాట. కాబట్టి ఈ పుస్తకంలో హాస్యం ఉంటుందని ఈ పేరు చెప్పకనే చెప్తూంది. బహుశా చెప్తూనే పోతూంది. హాస్యమంటే ఏమిటి? అది ఎందుకు వచ్చును? ఎవరికి వచ్చును? 'హాస్యము - సామాజిక స్పృహ' అనే వ్యాసం ఎవరైనా రాశారో లేదో నాకు తెలియదుగాని మన హాస్య రచయితలలో ఒకాయన ''మన హాస్యం'' అనే పెద్ద పుస్తకమే రాసి దేశంమీదకు వదిలారు. అది చదివితే నవ్వు రాలేదు. ఆ పుస్తకాన్ని కొందరికి ఎరువిచ్చాను. నేను సాధారణంగా నా పుస్తకాలను ఎరువివ్వను. ఇస్తే మళ్లీ రావని భయం. ఈ 'మన హాస్యం'' మట్టుకూ ఎన్నిసార్లు ఎరువిచ్చినా మళ్ళా మా యిల్లు వెతుక్కుంటూ వచ్చేసింది.

ఈ 'హాస్యజ్యోతి' మన హాస్యం మీద సిద్ధాంత గ్రంథం కాదు. రాద్ధాంత గ్రంథం కూడా కానేకాదు. దీని రచయిత పేరు శ్రీరమణ. ఈ నామధేయంలోని శ్రీకారం కూడా ఒక భాగమే. ....

పేజీలు : 184

Write a review

Note: HTML is not translated!
Bad           Good