ఎన్ని విద్యలు నేర్చినా, ఎన్ని వస్తువుల్ని సమకూర్చుకున్నా ఆలోచించి చూస్తే అన్నీ తాగడానికి, తినడానికే.

వెలకాంతలెందరైనను కులకాంతకు సాటిరారు, పలువిద్యలెన్ని నేర్చినా కులవిద్యకు సాటిరావు గువ్వలచెన్నా!

ఆడపడుచుసంపదతో కడుపునింపుకుని నీల్గే మనిషి ఎవళ్ళకీ తెలియకుండా నూతిలో పడడం మంచిది.

ఆడినమాటలు తప్పినవాడిని గాడిదకొడుకంచు తిట్టగా విని ఓ గాడిద, అయ్యో! వీడా నా కొడుకని ఏడ్చిందట.

వెల్లుల్లి పోపు పెట్టిన పుల్లని గోంగూర మంచి నెయ్యి వేసుకుని తృప్తిగా తింటే, అపుడు దాని రుచి ఎంతటిదో పొగడతరమా?

జీవిత పరమార్థం ఏమిటో తెలుసుకొని మనిషి మసలు కోవాలి. నలుగురూ వీడేమిటి మూర్ఖుడు అనుకున్నా తన లక్ష్యం వదలిపెట్టకూడదు.

ధనవంతుడైన పిసినారికంటే ఉదారగుణంగల పేదవాడు మేలు. పెద్దదైన సముద్రం కంటే చిన్నదైన తీయని నీళ్ళందించే చెలమ ప్రయోజనకారి కదా!

ఇలాంటి నీతులను, రీతులను, ఆచార వ్యవహారాలను, నాగరికతను, సంస్కృతిని ప్రబోధించే 115 పద్యాలు - భావంతో వున్నాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good