గురు - ఆచార్య పదములు

ఈ రెండు పదాలను ఒకే అర్థంలో వాడుతూ ఉంటాం. శాస్త్రజ్ఞుల దృష్టిలో కొంత భేదముంది.

ఆచార్య, ఆచరణ, ఆచార, చర, అనే పదాలకు దగ్గర సంబంధం ఉంది. చర అనగా చరించుట, వెళ్ళుట. చరిత లేక చరిత్ర యనగా నడత లేక ప్రవర్తన. ఎడతెగని సంఘటనలు చోటు చేసికొంటే దానిని దేశ చరిత్ర అని అంటున్నాం. అంటే దేశం యొక్క చరిత్ర. అట్లే జీవచరిత్ర, ఒక మనిషి జీవిత చరిత్ర, కదలిక యుంటే నడక. చరిత్రయనగా ఒక మార్గంగ గుండా పయనించడం, ఒక పద్థతిలో.

నడు, వెళ్లు అనే అర్థాలిచ్చే చర అనే ధాతువు నుండే ఆచార పదం వచ్చింది. (దీనినే తమిళంలో ఒళుక్కం అనగా ధర్మాదేశములను పాటించుట అనే అర్థంలో వాడుతారు) అంటే ధారారూపమైన ప్రవర్తన.

ఆచార్యుని ప్రవర్తన ఏ రూపంలో ఉంటుంది? అహింస, సత్యం మొదలైన సామాన్య ధర్మాలు. హిందూ మతంలో అనేక సంప్రదాయాల వారున్నారు. వైష్ణవ, మధ్య మొదలైన సంప్రదాయాలున్నాయి. అట్లే చైతన్య, నింబార్క సంప్రదాయాలు. విడివిడిగా కట్టుబాట్లు, ఆచారాలుంటాయి. వాటికి తగ్గ గ్రంథాలూ ఉన్నాయి. అట్లాగే శైవ సంప్రదాయంలో అనేక ఉపశాఖలున్నాయి. వీరశైవం, కాశ్మీర శైవం, పాశుపత, సిద్ధాంత శైవాలు (శైవ సిద్ధాంతం) ఇక వైష్ణవులలో ఏకాంతులు, వైఖానసులు, పాంచరాత్రులనే విభాగం ఉంది. స్మృతులలోని ఆచారాలను పాటించే వారిని స్మార్తులంటారు. అనగా అద్వైతులను.

Pages : 246

Write a review

Note: HTML is not translated!
Bad           Good