శరీరమనే బ్రహ్మాండాన్ని పరిశోధించగా తేలిన పరమార్థమే ఈశ్వరుడు. బ్రహ్మణ్యులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు.
సృష్టి వికాసానికి దైవతత్త్వమునకు మానుషప్రజ్ఞ తోడయి నడవటం పూర్వం నుంచి వున్నా ఆ పరతత్వమును గురించిన ఎరుక మన అందరకు అందదు. దానిని అందిస్తున్నవారు గురుదేవులుగా కీర్తింపబడతారు. శ్రీ వేటూరి ప్రభౄకరశాస్త్రిగారి ద్వారా ఆరోగ్యలాభాన్ని, మాస్టరు యోగ తేజస్సును అందుకొని అందరకు పంచుతున్నవారు శ్రీ కొత్త రామకోటయ్య తాతగారు. వారు తాము పొందిన మహామహిమ ఘనమైన యోగానుభూతులను అందరతో పంచుకొనేవారు. తాతగారు తన్మయులై ఆనందభాష్పాలు జాలువారుతుందగా తనను తాను మరచి శ్రీ శాస్త్రిగారిని స్మరిస్తుంటే దాని ప్రబౄవం మన చెవులను దాటి హృదయాన్ని తాకి అంతరంగ వికాసం కలిగిస్తుంది.
అలా ''సంపూర్ణ సమర్పణ'' కు నిదర్శనంగా నిలిచిన తాతగారి నుండి విన్నవి, చూచినవే కాక వారి పుస్తకాలు, ప్రసంగాల విషయ సమీకరణమే ఈ అక్షరమాల. - యం. శ్యామల
పేజీలు : 112