అభివృద్ధి అనే రాజకీయ ప్రహాసనాన్ని ఈ కథలు ప్రశ్నిస్తున్నాయి. నిలదీస్తున్నాయి. స్థానికత విశ్వజనీనతగా పరిణామం చెందే క్రమాన్ని ఈ కథలు సూచిస్తాయి. ఆదివాసీ ప్రజలను పాత్రలుగా మలచడంలో, ఆ ప్రజల సంబంధాలను ఆవిష్కరించడంలో రచయిత జాగ్రత్తగా వ్యవహరించారు. తాను అధ్యాపకడు కావడం వల్లనేమో చాలా కథల్లో విద్యారంగ ప్రసక్తి వస్తుంది. ఉత్తరాంధ్ర ఆదివాసీ ప్రజల సంభాషణలు ఈ కథలలో ఆకర్షణీయమైన విషయం. వస్తు చిత్రణలోనే కాదు వస్తు విస్తరణలోనూ రచయితలో సంయమనం వుంది. - రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

ఆదివాసిని అడవికి దూరం చేస్తున్న శక్తుల గురించి జగదీశ్‌ 'శిలకోల'లో సంధించిన ప్రశ్నలు మనల్ని యింకా వెంటాడుతూనే వున్నాయి. ఆ ప్రశ్నలకు నాగరిక పౌర సమాజం నుంచి గానీ రాజ్యపాలకుల నుంచి గానీ సమాధానాలు లభించలేదు. అడవి బిడ్డకు మునుపు అయిన గాయాలు మానలేదు... సలుపుతూనే వున్నాయి.  మళ్ళీ మళ్ళీ కొత్త గాయాలు అవుతూనే వున్నాయి. నెత్తురోడుతున్న దేహంతో సడలని పోరాట పటిమతో రాజీలేని నిబద్ధతతో యిప్పుడు 'గురి' తప్పని కథలతో అభివృద్ధి లోగుట్టు విప్పి చెబుతూ మరోసారి మన ముందు నిలబడ్డాడు జగదీశ్‌. ఈ సారి అతని గొంతు రాటు తేలింది. చూపు నిశితమైంది. - ఎ.కె.ప్రభాకర్‌

పేజీలు : 196

Write a review

Note: HTML is not translated!
Bad           Good