"తెలుగులో నవ్యరీతులకు నూతన ప్రమాణాలకు ప్రయత్నించిన మొదటి కవిని నేనే. నా కావ్యకళ నవీనం; కావ్య యితివృత్తాలు భారతీయం. కవితలో నేను ఉత్తమ ప్రయోజనాలను ఉపలక్షించాను; జీవితాన్ని నూతన దృక్పథంతో దర్శించి, కథా, కవితారూపంలో దాని తత్త్వాన్ని అన్వయించడానికి ప్రయత్నించాను. నాకు ఆ కళల పట్ల, జీవితం పట్ల కొన్ని ఆదర్శాలు వున్నాయి."

"భావనాశక్తి మనిషిని తన ఆలోచన, స్పందన పరిధులను దాటిస్తుంది. మనిషిని తన నుండీ ప్రకృతిలోకీ, జనావళి లోకి ప్రవేశపెడుతుంది. తన స్పందనలు, వేదనలు తన బయటకూడా సమానంగా అనుభవించటం చూసిన మనిషి ఇతరుల పట్ల సహానుభూతిని పొందుతాడు. అందరి కష్టాలు, కన్నీళ్లు, ఆకలి, సంతోషాలు సమానమే అని భావించిన మనిషి మనుషులందరిలో సమానత్వాన్నీ దర్శిస్తాడు. ఈ సమానత్వ దృష్టి కలిగిన వ్యక్తి మానవీకరించ బడతాడు, కళలు మానవానుభూతులను, ఉద్వేగాలను ప్రదర్శించడం చేత, ఆ ప్రతిఫలనాన్ని కళాత్మకంగా అనుభవించి కళారూపాల పట్ల ఆకర్షితుడవుతాడు. అంతిమంగా కళాకృతులు మానవునిలో ఈ సమానత్వ బీజాన్ని నాటుతాయి."

Write a review

Note: HTML is not translated!
Bad           Good