దేశాభిమానం నాకు కద్దని

వట్టి గొప్పలు చెప్పుకోకోయి,

పూని యేదైనాను నొకమేల్‌

కూర్చి జనులకు చూపవోయి!

గురజాడ భావాలకూ, సంస్కరణలకూ ఇప్పుడు గతం కన్నా ప్రాధాన్యత పెరిగింది. అందుకు దేశంలో వచ్చిన రాజకీయ, సామాజిక దుష్పరిణామాలు కూడా ఒక కారణం. ప్రపంచీకరణలో భాగంగా మత, మార్కెట్‌ తత్వాలు విజృంభించిన నేపథ్యం ఇందుకు ప్రధాన భూమిక. ఎప్పుడో తిరస్కరించిన ఛాందసాలు, మూఢ విశ్వాసాలు కొత్తగా వూపిరి పోసుకుంటున్నాయి. కావాలని పోస్తున్నారు. అన్నీ వేదాల్లో వున్నాయట అనే అగ్ని హోత్రావధాన్లు కంప్యూటర్లలోంచే పుట్టుకొస్తున్నారు. వట్టి మాటలు కట్టిపెట్టి, దేశి సంపద పెంచే గట్టి మేల్‌ తలపెట్టవలసిన తరుణం. కనుక ఇప్పుడు మరోసారి గురజాడను చదవడం ఇలాంటి వాటిని చక్కదిద్దడానికి, వెనక్కు కొట్టడానికి దోహదపడుతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good