''కన్యాశుల్కం 1990లో మొదటిసారి చదివినప్పుడు నాలో ఏదో మార్పు కలిగింది. ఆ నాటకము మొదటిసారి చదివినవాళ్ళు ఎవరైనా సరే ఆశ్చర్యపడి ఏదో కొంత మార్పు పొందకుండా ఉండలేరు.'' - శివశంకరశాస్త్రి. ''ప్రతిభ''

''ఆ కాలంలోనే (1900 ప్రాంతం) మా కాలేజీ సంవత్సరికోత్సవాలలో చిన్న చిన్న నాటకాలు ఆడిస్తూ వుండేవారు. మా కంటే పెద్ద విద్యార్థులు ఒకసారి కన్యాశుల్కం మొదటి దృశ్యాలు ప్రదర్శించారు. అందులో నేను వెంకటేశం పాత్ర. (బుర్రా) శేషగిరిరావు కరటక శాస్త్రి పాత్ర ధరించాము.'' - గిడుగు సీతాపతి, స్వీయ చరిత్ర'

''ప్రజలకు సన్నిహితంగా వున్నటువంటి భాషలో, తెలుగు సంస్కారంలో వున్న దైన్యాన్ని, మాలిన్యాన్నీ, కుట్రల్నీ, కూహకాల్నీ, ఆశనీ, నిరాశనీ చిత్రించటంలో యీ నాటకాన్ని మించింది యింకోటి లేదు. నేడే కాదు రేపటిక్కూడా యిది ఆడదగినదే, చూడదగినదే!'' - అబ్బూరి రామకృష్ణారావు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good