గురజాడ 150వ జయంతి సందర్భంగా పునర్ముద్రించిన తెలుగునాటకాలలో ఆణిముత్యం కన్యాశుల్కం.
వైవాహిక వ్యవస్థ, స్త్రీ దురవస్థ,
బాల్య వివాహాలవల్ల శిశు వితంతువుల
మూగగోడు, నరమాంస విక్రయం ద్వారా
తల్లి దండ్రుల పశుప్రవృత్తి, సంసారుల దొంగచాటు
వ్యభిచారం, సానుల బాహాటపు వ్యభిచారంతోటి పోటీ,
బ్రాహ్మణా బ్రాహ్మణులకూ బ్రహ్మణశాఖలకు పరస్పర
ద్వేషదురభిమానాలు, తాగుళ్ళు, జూదాలూ, కోర్టులకెక్కి ఇల్లు గుల్ల
చేసుకోవడాలు - అత్యాశతో గురజాడ అప్పారావు తన నాటకాన్ని
దాదాపు ఒక పెద్ద కలగూరగంప చేసుకోబోయాడు, అలా
చేసుకోవడమే జాతికి లాభించింది. సాహితికి శోభ నిచ్చింది.
మహాకావ్య విస్తారం గల ఒక గొప్ప సాంఘిక నాటకం,
సి.ఆర్‌.రెడ్డి వర్ణించినట్లు, షడ్రసోపేతమైన విందు
భోజనం లాగా దేశానికి దక్కింది, పుడకలు ఎన్నైనా
వుండవచ్చు, వున్నాయి కూడాను,
అయినా పానకం పానకమే. - శ్రీశ్రీ

Write a review

Note: HTML is not translated!
Bad           Good