ఈ గ్రంథంలో నేటి గుంటూరు జిల్లా ప్రాంతానికి మాత్రమే పరిమితమైన నాటి బి.ఎస్‌.ఎల్‌. పరిశోధక, జనరంజక వ్యాసాలను (లభించినంతవరకు) పొందుపరచటం జరిగింది. ఇది రెండు భాగాల గ్రంథం : మొదటి భాగంలో ఆంగ్ల వ్యాసాలు, రెండవ భాగంలో తెలుగు వ్యాసాలు. ఈ పుస్తకంలో గల +బఅ్‌బతీ ుష్ట్రతీశీబస్త్రష్ట్ర ూస్త్రవర, గుంటూరు ప్రశిస్తి అనే రెండు వ్యాస సంపుటాల్లో హనుమంతరావు గారు గుంటూరు చరిత్రను ఆదిమమానవుని కాలం నుంచి ఆధునిక యుగందాకా నిశిత పరిశోధనతో ఆవిష్కరించారు. మౌర్య, శాతవాహన, ఇక్ష్వాకు, ఆనందగోత్రిన, శాలంకాయన, బృహత్పలాయన, విష్ణుకుండిన, తూర్పుచాళుక్య, వెలనాటి చోళ, హైహయ, కాకతీయ, రెడ్డి, విజయనగర, కుతుబ్‌షాహీ, మొఘల్‌, ఆసఫ్‌ జాహీ, ఈస్టిండియా కంపెనీ, ఫ్రెంచి, జమీందారీ కాలాలలో రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్క ృతిక రంగాలలో గుంటూరు సీమ పాత్రను ఎంతో హృద్యంగా చిత్రీకరించారు. చివరగా గుంటూరు  జిల్లా ఏర్పాటు, కృష్ణా జిల్లాలో కలయిక, మళ్లీ గుంటూరు జిల్లా ఏర్పాటు వరకు తిరిగిన అనేక చారిత్రక - రాజకీయ మలుపుల్ని కళ్ళకు కట్టినట్లు వివరించారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good