దేశ చరిత్రలలో ప్రాంతీయ చరిత్రలలోని వివరాలన్నిటిని నమోదు చెయ్యటం సాధ్యపడదు. ఉపప్రాంత వివరాలు స్థలాభావం చేత వదిలివేయబడతాయి. అయితే ఆ సంఘటనలు, ఆ వ్యక్తుల సాహస కృత్యాలు, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన త్యాగాలకు ఏ మాత్రం తీసిపోవు. ఉపప్రాంతాలలోని వీరులు, త్యాగమూర్తులు చాలావరకు unwept and unsung గానే వుండి పోతారు. ఈలోపాన్ని సరిదిద్దటానికి, ప్రాంతీయ, ఉపప్రాంతీయ, స్థానిక చరిత్రలను వెలుగులోకి తీసుకొని రావాల్సిన అవసరం ఎల్లప్పుడూ వుంటుంది.
ఇలాంటి కార్యక్రమాలు విశ్వవిద్యాలయాలు పూనుకొని నిర్వర్తించాలి. ఎవరికి వారు తమ మూలాలను తెలుసుకోవడం, వాటిని భద్రపరచి ముందు తరాలవారికి అందివ్వడమే చరిత్ర. ఇదే “మైక్రో” చరిత్ర... నిత్యజీవన వ్యాపారంలో చరిత్ర, కళలు, సంస్కృతి, సాహిత్యం మొదలైనవాటిని వెనుక వరుసలో కూర్చోబెడుతున్నాం. వెనుకటి తరాల ప్రజలు, పాలకులు శాశ్వతమైన శిల్పాలు, అద్భుతమైన కట్టడాలు సంస్కృతిని మనకు మిగిల్చివెళ్ళారు.
మనంవాటిని రక్షించి తరువాతి తరాల వారికి ఇవ్వకపోగా, వాటిని అశ్రద్ధతో నశింప చేస్తున్నాం. నేటి తరంకూడా అందుకు భిన్నంగా ఏమీలేదు... జీవితంలో సున్నిత భావాలను గురించి ఏమాత్రం స్పందనలేకుండా జీవిస్తున్నామనడానికి సంస్కృతిపట్ల మన అశ్రద్ధ, ఒక ప్రబల ఉదాహరణ మాత్రమే.

Write a review

Note: HTML is not translated!
Bad           Good