ఒక జిల్లా చరిత్రను నిక్షిప్తం చేయడమంటే ఒక చరిత్రను తివ్వి రాశిగా పోయడమే. నిన్న నేటికి గతం...నిన్న నేటికి చరిత్ర...ఒక నాటి అపురూప చరిత్ర భావితరానికి అడుగుజాడ...తరతరాల గన చరిత్ర వర్తమానానికి వన్నె చెరగని పాఠం...అవే నేటికి స్ఫూర్తి, ప్రేరణ, స్పందన, చేతనను నూరిపోస్తాయి. అటువంటి శతాబ్దాల ఘన చరిత్రకు అక్షరరూపం కలిగించడం ఒక అసిధారావ్రతం...ఆయజ్ఞ నిర్వహణకు కఠోర పరిశ్రమ కావాలి. వేన వేల రోజుల చరిత్రను మధించి...మధించి..అందులో నుండి సువర్ణాధ్యాయాల సారాన్ని ఒకచోట ప్రోది చేయాలి. అప్పుడే ఒక జిల్లా చరిత్ర గ్రంథస్తమై భవితకు సుందర సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది. ఈ ప్రయత్నంలో రచయిత చిట్టినేని లక్ష్మీనారాయణ క్రశమ దమాదుల కోర్చి తలకు మించిన భారాన్ని మోసి...సఫలీకృతుడయ్యాడు.

ఆదిమ సమాజం  నుంచీ, ఆధునిక సమాజం దాకా ఆంధ్రుల చరిత్రలో గుంటూరు సీమ తల్లిఒడిలా నెలకొనివుంది. మనది నాగభూమి. జక్కులు, యక్షులు, నాగులు గుంటూరు సీమలో ఆదిమ తెగలుగావుండేవి. రామాయణ, భారత యితిహాసాలకు చెందిన ఘట్టాలు గుంటూరు సీమలో జరిగిన దాఖలాలున్నాయి. క్రీస్తు పూర్వం ఉత్తరభారతదేశంలో మగధ సామ్రాజ్యాన్ని అశోక చక్రవర్తి పరిపాలించే రోజుల్లో ఆంధ్ర భృత్యులు గుంటూరు సీమలో కృష్ణాతీరంలో ఉండేవారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good