మన దేహంలో ఉండే గుండె సాధారణంగా మన చేతి పిడికిలంత పరిమాణంలో ఉంటుంది. కాని దాని గురించి తెలుసుకోవాల్సింది మాత్రం కొండంత . గుండె ప్రతి రోజూ సుమారు లక్ష సార్లు కొట్టుకుంటుంది. నిమిషానికి 70 సార్లు కొట్టుకునే గుండె, నిమిషానికి సుమారు 5 లీటర్లు రక్త్గాని బయటకు పంపుతుంది. ప్రతిరోజూ 2100  గెలన్ల రక్తాన్ని పంప్ చేస్తో ఉంటుంది. ఈ రక్తం శరీరంలోని మొత్తం సుమారు లక్ష కోలోమీటర్లు ఉండే వివిధ రక్త నాళాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తీ జీవితంలో 2.5 బిలియన్ల సార్లు గుండె కొట్టుకుంటూ 227 మిలియన్ల లీటర్ల రక్తాన్ని పంప్ చేస్తూ వుంటుంది. గుండె అనబడే ఈ అద్బుత యంత్రం రాత్రింబవళ్ళు, 365 రోజులు, మనిషి జీవించినంత కాలం పని చేస్తూనే ఉండాలి. వందేళ్ళు పాటు నిరంతరాయంగా పనిచేయగల సామర్ధ్యం ఉన్న గుండె సక్రమంగా పని చేయాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో |గుండె నిర్మాణం , విధులు, దానికి వచ్చే రుగ్మతలు ,కే వాటి కారణాలు, వాటి నిరోధానికి తీసుకోవలసిన జాగ్రత్తల్ అగురించి అమూల్య సమాచారాన్ని, సామాన్యులకు సైతం అర్ధమయ్యేలా ప్రముఖ వైద్య నిపుణులైన డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి గారు సులభ శైలి లో అందించిన గుండెజబ్బులు - నివారణ పుస్తకం. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good