సామాన్యంగా వచ్చే గుండె జబ్బులలో గుండె నొప్పి (యాన్‌జైనా పెక్టోరిస్‌), మరియు గుండెపోటు (హార్ట్‌ ఎటాక్‌) ముఖ్యమైనవి. ఈ జబ్బులు ఎటువంటి పరిస్థితులలో వస్తాయి? రక్తంలోని కొవ్వు పదార్థాలు గుండెలోని రక్తనాళాలలో బాగా పేరుకొని పోయినప్పుడు గాని, ఏవో కారణాల వల్ల రక్తం గడ్డకట్టినప్పుడు గాని, రక్తనాళాల రంధ్రాలు చిన్నవై ప్రసారానికి అడ్డు కలిగించునప్పుడు గాని గుండె నొప్పి, పోటుగాని రావచ్చు. కొన్ని సందర్భాలలో గుండెలోని కొన్ని భాగాలకు రక్తప్రసరణ ఆగిపోయినప్పుడు ఆ భాగాలు దెబ్బతిని పనిచేయవు. దీన్ని 'మయోకార్డియల్‌ ఇంఫ్రాక్షన్‌' లేక 'యం.ఐ.' అంటారు.

రక్తనాళాలలో కొవ్వు పదార్థాలు కొంచెం కొంచెంగా పేరుకుంటూ క్రమేపీ పెద్దవై గట్టిపడుతుంది. దీనిని 'ఎథెరోస్ల్కేరోసిస్‌' లేక 'ఆర్టిరియోస్ల్కెరోసిస్‌' అంటారు. ఇది ఎందుకు వస్తుందో, ఎట్లా వస్తుందో ఖచ్చితంగా తెలియదు. ఈ జబ్బు వచ్చే విధానాన్ని తెలుసుకొనేందుకు చాలా దేశాలలో పరిశోధనలు జరుగుతున్నాయి.

Pages : 127

Write a review

Note: HTML is not translated!
Bad           Good