తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని ఇమడ్చడం గుల్జార్‌ కవి శైలి. జీవలక్షణం. అది సినిమా స్క్రీన్‌ప్లేకీ, పాటలకూ, దర్శకత్వానికీ, కథలకూ అన్నిటికీ వర్తిస్తుంది. 'ధువా' పేరిట కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన గుల్జార్‌ కథలను అనువదించే అదృష్టం నాకు లభించింది. ఇందులో 28 కథలున్నాయి. ఇవి చదివితే గుల్జార్‌ భావనా వీధి ఎంత విశాలమైనదో, అతని జీవితం, ఆలోచనలు ఎంత వైవిధ్య భరితమైనవో, అతని సృజన శక్తి ఎంత శక్తిమంతమైనదో అర్థమౌతుంది. అతి బడుగువర్గాల జీవిత వాస్తవికత నుంచి (ఇది ఎవరి కథ) అత్యాధునికుల జీవన సరళి (సీమా) వరకు అనేక వస్తువులు ఇందులో మనకు కనిపిస్తాయి. గుల్జార్‌ వ్యక్తిగత  జీవితంలో నిజంగా జరిగిన ఘటనలు (బిమల్‌దా, విభజన వంటి కథలు), మానవ స్వభావంపట్ల అసాధారణమైన అవగాహన, విశ్వాసం, గల కథలు కూడా ఇందులో ఉన్నాయి. ఏ కథా మరో కథలా ఉండదు. ఏ పాత్రా మరో పాత్రలా ఉండదు. అనంతమైన వైవిధ్యం సుందరమైన అండర్‌ స్టేట్‌మెంట్‌తో మనల్ని అలరిస్తూ ఆలోచింపజేస్తుంది. కవి కనక, ధ్వని, రసం - రసధ్వని ఎరిగిన నిపుణుడు.- మృణాళిని

Write a review

Note: HTML is not translated!
Bad           Good