'గుజరాత్ 2002 జాతి హత్యాకాండ'' (కమ్యూనలిజం కంబాట్) పుస్తకాన్ని దాదాపు 12 సంవత్సరాల క్రితం హైదరాబాద్ బుక్ ట్రస్ట్, ప్రజాశక్తి బుక్ హౌస్ సంయుక్తంగా ప్రచురించాయి. మా పుస్తక ప్రచురణలో ఇదొక మైలురాయి వంటిది. ఒకటి కాదు అనేక విధాలుగా ఈ ప్రచురణ మాలో మార్పును తీసుకొచ్చింది. తెలుగు అనువాద సమయంలో గుజరాత్లో జరిగిన దారుణ మారణకాండ సంఘటనలు మా గుండెల్ని పిండివేశాయి. కౌసర్ బీ వంటి వారితోపాటు  మేమూ రోదించాము. సామాన్య హిందువులను - కొన్ని రాజకీయ దుష్టశక్తులు - అమాయక స్త్రీలపై  అత్యాచారాలు జరిపి హతమార్చే రాక్షసులనుగా మార్చాయి. వాళ్లు వృద్ధులూ, మహిళలతో సహా ముక్కు పచ్చలారని పసిపిల్లల్ని సైతం శూలాలతో, కత్తులతో పొడిచి చంపారు, సజీవ దహనం చేశారు. విచ్చలవిడిగా గృహదహనాలకు, ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు.

ఆ దారుణకాండ జరిగిన పుష్కరానికి ఇప్పుడు - 2014లో - ఈ సాధారణ ఎన్నికల సమయంలో - గుజరాత్ నమూనాను యావద్భారతదేశానికే ఆదర్శప్రాయమైనదిగా ఊదరగొడ్తుండం దిగ్భ్రాంతిని, ఆవేదనను ఆక్రోశాన్ని కలిగిస్తోంది.

ఈ నేపథ్యంలో ''గుజరాత్ 2002 జాతి హత్యాకాండ'' పుస్తకానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పుస్తకంతో పాటు
1) ''ఇస్లాంపై, ముస్లింలపై తరచూ జరిగే ప్రచారాలు అసలు నిజాలు'',
2) ''గుజరాత్ మారణకాండను ఎలా మరచిపోగలం''
అనే మరో రెండు చిన్న పుస్తకాలను పునర్ముద్రించాం. పాఠకులు వీటిని చదివి, చర్చించి విస్తృత స్థాయిలో ప్రజల ముందుకు  తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం.

భారతదేశంలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమూ, చట్టబద్దపాలనా వుండాలనీ, మానవ విలువల్ని కాపాడుకోవాలనీ అనుకునే వ్యక్తులకీ సంస్థలకీ గుజరాత్ పెద్ద సవాలు విసిరింది. భారత రాజ్యాంగమ్మీద జరుగుతున్న ఈ ఫాసిస్టు దాడిని మనం ఎదుర్కోగలమా?
... ... ...

అహ్మదాబాద్ వెళ్తున్న సబర్మతీ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో ఒక బోగీపై గోధ్రా వద్ద దాడి చేసి తగులబెట్టడం, 12మంది పసిపిల్లలు, 26 మంది మహిళలతో సహా 58 మందిని సజీవ దహనం చేయడం క్షమించడానికి వీల్లేనంత రాక్షసత్వం. ఆ అమానుష అకృత్యానికి పాల్పడిన దుర్మార్గులని తక్షణమే విచారించి కఠినాతి కఠినంగా శిక్షించి తీరాల్సిందే.

కానీ ఆ నెపంతో-  ఆ దారుణంతో ఏమాత్రం సంబంధంలేని స్త్రీలపై  అత్యాచారాలు జరుపడం , పసిపిల్లలతో సహా అనేకమంది స్త్రీలనూ పురుషులనూ హతమార్చడం, విచ్చలవిడిగా విధ్వంసానికి పాల్పడడం అమానుషం. సభ్యసమాజం తలదించుకునేట్టు చేసిన ఉన్మాదం.
ఏమతం, ఏ ధర్మశాస్త్రం ఈ పైశాచికత్వాన్ని సమర్థిస్తుంది?
గుండెల్ని పిండివేసే  ఇలాంటి అనేక దారుణాలను కమ్యూనిజం కంబాట్ పత్రిక సంపాదకులు తీస్తా సెతల్వాద్, జావెద్ ఆనంద్లు ఈ ప్రత్యేక సంచిక ద్వారా వెలుగులోకి తెచ్చారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good