తేట తేనెల తియ్యదనం - పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడంలో అందరూ తలమునకలవుతున్నారు. కానీ వాళ్ళ ఆటపాటల సంగతి పట్టించుకునేది ఎంతమంది? ఆటపాటలు పిల్లల శరీరాన్నే కాక మెదడును కూడా శక్తిమంతం చేస్తాయి. యాంత్రికమైన చదువుల్లో మునిగి మొద్దుబారిన మనస్సులకు ఆటపాటలే ఆహ్లాదం కలిగిస్తాయి. వెనకటి కాలంలో పిల్లలకు జోలపాటలు మొదలు మరెన్నో గేయాలు, కథలను పెద్దవాళ్ళు నేర్పేవారు. నేటి నాగరిక జీవితంలో అవన్నీ పాత చింతకాయ పచ్చళ్ళు అవుతున్నాయి. మన జానపద గేయాల్లో పిల్లలకు ఆటలకు తగ్గ పాటలెన్నో మరుగుపడి ఉన్నాయి. వాటిలో కొన్నింటిని తెలుగు భాషా పరిశోధకులు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి త్రవ్వి తీశారు. ఎన్నడో మరుగుపడిపోయిన ఆ పుస్తకం ఇప్పుడు మళ్ళీ వెలుగు చూస్తున్నది.ఈ పాటలలో మంచి మంచి తెలుగు పలుకుబడులున్నాయి. తెలుగువాళ్ళ సంస్క ృతిని తెలిపే విశేషాలున్నాయి. సంగీత పద్ధతులున్నాయి. నీతి నిధులున్నాయి. సంగీత పద్ధతులున్నాయి. సాహిత్యపు పరిమళాలున్నాయి. విజ్ఞాన కాంతులున్నాయి. ఇంకా ఆలస్యమెందుకు? ఈ ఆటపాటల మాధుర్యం తేటతేనెల తియ్యదనం పిల్లలకు చవిచూపిద్దాం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good