జోగారావుగారి కథలు ముగించిన మరుక్షణం గొంతు పూడుకుపోతుంది. గుండె పట్టేస్తుంది. కళ్ళ వెంట జలజలా కన్నీళ్ళు కారిపోతాయి. ఎందుకిలా జరుగుతుందంటే, ఆయన కథలు చాలావరకు విషాదాంతాలు కావడమే!

దిగువ మధ్యతరగతి జీవితాల్లో ఉన్న విషాదాన్ని యధాతధంగా చిత్రించగల కళింగాంధ్ర రచయిత పంతుల జోగారావు ఒక్కరే! కథావస్తువు స్వీకరించడంలోనూ, కథ చెప్పే విధానంలోనూ జోగారావుగారికి ఒక ప్రత్యేకత ఉన్నది. అది గుండెని గుండెకు ముడిపెడుతుంది. రచయితకూ పాఠకుడికి మధ్య ఆధ్యాత్మ అనుభంధాన్ని పెంచి పెనవేస్తుంది. ఏవర్గానికి తన కథలు చెందుతాయో, ఆ వర్గానికి ఆ కథలు చేసే అదృష్టానికి నోచుకున్న ఏకైక రచయిత పంతుల జోగారావు. - ఎ.ఎస్‌.జగన్నాధశర్మ

Write a review

Note: HTML is not translated!
Bad           Good