పూజ్యులు , పిత్రుతుల్యులు శ్రీ గూడవల్లి రామ బ్రహం గారు తీసిన మాయలోకం (1945 ) లో నేను రాకుమారుడిగా నటించాను, ఐతే, ఆ వేషం వుందని తెలిసి ప్రయత్నించడానికి వెళ్ళినపుడు నాకేమి తెలీదు, నమస్కారం పెట్టాలన్నా కనీస సంస్కారం కూడా తెలియని వాడిని, నన్ను పంపిన ఘంటసాల బలరామయ్యా గారిని 'ఎవడయ్యావీడు ? - అని అడిగితె 'మీ వాడే' అన్నారాయన అంటే ' మీ కులం వాడే నని సూచన '  అందుకేనా అంత ... అన్నారు. రామబ్రహం గారు అంత పొగరు నాకుందన్నట్టు ! పల్లెటూరి వాడు,పద్దతులు తెలియవు కై మంచి కుర్రాడు. వృద్ధిలోకి రావలసిన వాడు. అని నా గురించి  పెద్దలు చప్పడంతో  - రామబ్రహ్మ్గాగారు నాకు ఆ వేషం ఇచ్చారు. అలా అయన దగ్గర చేరాను. క్రమేణా నా  పట్ల ఆయనకీ వాత్సల్యం కలిగింది. ప్రేమగా చూశారు. నను తన ఇంట్లోనే పెట్టుకున్నారు. నాకు ఏం  కావాలో అది పెట్టారు. నేను కుర్రాడిని కనుక,ణా  ప్రవర్తన మీద ఒక కన్ను వేసి ఉంచేవారు. రామ బ్రహం గారు గొప్ప సంస్కారి.  ఆయన చూపిన వాత్సల్యాభిమానాలే నాకు పాఠాలైనాయి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన మాలపిల్ల , రైతుబిడ్డ వంటి సంచలన  చిత్రాలు తీసిన గొప్ప దర్శకుడు. నా  అదృష్టం వల్ల  నేను ఆయన పెంపకంలో ఉంటూ మాయ లోకం, పల్నాటి యుద్ధం, చిత్రాల్లో నటించాను. పెద్దవారి ప్రోత్సాహం , పెంపకం, ఆదరణా లభించకపోతే ఏ వ్యక్తీ ఉన్నత స్థానం పొందలేదు.
నేను ఎప్పుడూ ఆయన్ని దర్శకుడిగా చూడలేదు. తండ్రిగా చూశాను. నన్ను ఆయన కొడుకులా చూశారు. వారి ఆశీస్సులు, అభిమాలె నాకు రక్షగా నిలబడ్డాయి. అటువంటి గొప్ప దర్శకుడి జీవిత కధను వివరిస్తూ పుస్తకం రావడం ఏంతో సంతోషం.  పుస్తకాన్ని వెలువరిస్తున్న రచయితను ప్రచురణ కర్తలను అభినందిస్తున్నాను. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good