పెర్సియస్‌, జేసస్‌, హెర్క్యులిస్‌. గ్రీకు పురాణ గాధల్లో ఈ ముగ్గురు వీరులూ సుప్రసిద్ధులు. వీరు ముగ్గురూ దైవాంశ సంభూతులు. అయినా వారికి కష్టాలు తప్పవు. దేవతల మధ్య తగాదాల్లో కూడా వీరు నలిగిపోతుంటారు. కాని తమ అసమాన సాహసంతో ప్రతిభతో పట్టుదలతో కొందరి దేవతల అనుగ్రహంతో వీరు తమ లక్ష్యాలను సాధిస్తారు.

    ప్రాచీన నాగరికతలు ఉన్న దేశాల్లోనూ ప్రాంతాల్లోనూ పురాణ గాథలుంటాయి. మనకు ఇంద్రుడు ఉన్నట్లుగానే గ్రీకు గాథల్లో జూస్‌ ఉన్నాడు. రోమన్‌ పురాణాల్లో జూపిటర్‌ ఉన్నాడు. అతని ఆధీనంలో వివిధ దేవతామూర్తులు వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. మనుషులు వారికి రకరకాల నివేదనలు అర్పించి వారిని ప్రసన్నులను చేసుకోవడానికి తిప్పలు పడుతూ ఉంటారు.

పెర్సియస్‌, జేసస్‌, హెర్క్యులిస్‌. వీరి సాహస కథామాలికే ఈ పుస్తకం.

Pages : 110


Write a review

Note: HTML is not translated!
Bad           Good