ఈ సంకలన గ్రంథంలో అజ్ఞాత రచయితలతో సహా దాదాపు 500 మంది రచయితలు రాసిన 5000 గ్రంథాల నుంచి సేకరించిన మరవరాని మాటలున్నాయి.
భిన్న రచనల్లో భిన్న పాత్రల ద్వారా భిన్న సందర్భాల్లో రచయితలు వెలిబుచ్చిన విలక్షణాభిప్రాయాలు 2500 శీర్షికల కింద కన్పిస్తాయి.
సాహిత్యాభిమానాన్ని సంభాషణా చాతుర్యాన్ని ప్రదర్శించదలచిన సాహితీపరులకిది అమూల్యమైన సహకారి.
ఈ సంకలన గ్రంథంలో నన్నయ్య నాటినుంచి ఈనాటి రచయితలదాక ప్రదర్శించిన సాహితీ సౌరభాలతో పాటు లోకజ్ఞానం కల్పించే వాక్యాలున్నాయి.
జీవద్భాషా సాహిత్యానికి సంబంధించింది కాబట్టి సమగ్రం కాదు కానీ తెలుగులో ఇదే మొట్టమొదటి విస్తృతమైన సంకలన గ్రంథం.
రచయితల పేర్లు, శీర్షికల వివరాలు విడిగా కన్పిస్తాయి. రచనల పేర్లు ఆయా మరపురాని మాటలకిందే సూచించాం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good