ఇంతకు ముందు కూడా గ్రామ సర్వేలు జరిగాయి. అవి ప్రధానంగా అకడమిక్‌ పరిశోధకుల ఆధ్వర్యంలో జరిగాయి. ఒకటి రెండు గ్రామాలకు పరిమితం అయిన పరిశోధనలు జరిగాయి. కానీ ఇప్పటి సర్వే విస్తృతంగా జిల్లాలు, ప్రాంతాల్లో వ్యవసాయ పద్ధతులను పరిగణలోకి తీసుకుని జరిగింది. అంతేకాక విషయ జ్ఞానం కోసమే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంత ఉద్యమాలకు తోడ్పడేందుకు ఈ సర్వే ఉద్దేశించింది. అందుకే సర్వే ప్రక్రియలో అన్ని దశల్లోనూ ఉద్యమ కార్యకర్తలు భాగస్వాములు అయ్యారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంతోపాటు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, అఖిల భారత కిసాన్‌ సభ కార్యకర్తలు అన్ని దశల్లోనూ భాగస్వాములు అయ్యారు. ఉద్యమ శ్రేయోభిలాషులు మేధావులు ఈ కృషికి ప్రత్యక్షంగా, పరోక్షంగా తోడ్పడ్డారు. అనుభవజ్ఞులైన మేధావుల నైపుణ్యం, కార్యకర్తల క్షేత్రస్థాయి పరిజ్ఞానం మేళవింపబడటం ఈ సర్వే విశేషమే కాక సర్వే ఫలితాలు మరింత ప్రయోజనాత్మకంగా ఉండేందుకు తోడ్పడింది. విశ్లేషణ ఫలితాలను పరిశీలించిన వారెవరైనా ఈ విషయాన్ని గమనిస్తారు. - బి.వి.రాఘవులు

Pages : 174

Write a review

Note: HTML is not translated!
Bad           Good