ఈ గ్రంథంలో నాటకాల కథాంశాల విశ్లేషణ, పాత్రల విశ్లేషణలతో బాటు, రచయితల వివరాలు, వీలయినంతవరకు ప్రదర్శనల వివరాలు, రచనల్లో వాడిన గ్రామీణ పదాలు, వివిధ ప్రాంతాలలో వాడుకలో ఉన్న సామెతలు, కొన్ని నాటకాలలో ఉపయోగించిన జానపద గేయాలు, కళారూపాలు లాంటి అంశాలను సీతారామయ్యగారు మనకు అందించారు. నిజంగా ఇది గొప్ప పరిశోధనే. నటుడిగా, సమాజ నిర్వాహకుడిగా, న్యాయనిర్ణేతగా అరవై సంవత్సరాలకి పైగా అనుభవం ఉన్న సీతారామయ్యగారు, ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో సంచరించడం వల్ల, ఆయనకున్న పరిశీలనాశక్తికి, జ్ఞాపకశక్తికి ఈ గ్రంథం ఒక ఉదాహరణ. ఈ గ్రంథంలో ఇంకా అనేకమంది పెద్దలు చెప్పిన నాటకరచనా పద్ధతులు, వివిధ పాశ్చాత్యవాదాలు, రచనా భేదాలు సిద్ధాంతాలు, నవరసాల ప్రస్తావన కూడా మనకి కనిపిస్తాయి. ఆయనకున్న అపార జ్ఞానసంపద, మేథాశక్తి మొదలైన సద్గుణాలు మనకు తెలుస్తాయి. సామాన్య పాఠకులకి ఎన్నో విషయాలు, నాటక విద్యార్థులకు పాఠాలు ఈ గ్రంథం బోధిస్తుంది.
- ఆచార్య డి.యస్.యన్.మూర్తి
Pages : 664