సుందరయ్య విజ్ఞాన కేంద్రం, జనవిజ్ఞానవేదికల ప్రస్తుత అధ్యయనం రాష్ట్రంలోని 22 గ్రామీణ జిల్లాలలో 88 గ్రామాల సర్వే ఆధారంగా జరిగిందంటే దాని విస్తృతిని అర్ధం చేసుకోవచ్చు. అలాగే ఆ అధ్యయనం వెలువరించిన నిర్ధారణలు కూడ ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలలో వివిధ సామాజిక ఆర్థిక తరగతుల వర్తమాన స్థితిగతులను ఈ అధ్యయనం స్పష్టం చేస్తుంది. గ్రామీణ పరిస్థితిని ఇంకా లోతు అధ్యయనం చేయదల్చిన పరిశోధకులకు, రైతు - వ్యవసాయ కార్మికరంగాలలో పనిచేసే కార్యకర్తలకు, సామాజిక ఉద్యమాలలో పాల్గొనే కార్యకర్తలకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది. మొత్తంగా దేశంలో వర్గసంబంధాల స్థితిగతుల అధ్యయనానికి దోహదపడుతుంది.  - బి.వి.రాఘవులు

Write a review

Note: HTML is not translated!
Bad           Good