డాక్టర్ టి.వి. వెంకటేశ్వరన్ : ప్రస్తుతం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ జాతీయ సైన్స్ ప్రచారకేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్త. లోగడ దేశంలోని వివిధ రాష్ట్రాలలో సైన్సు ప్రచారం చేస్తున్న ఆలిండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్లో ప్రధాన పాత్ర వహించారు. దీని అనుబంధ సంస్థే మన రాష్ట్రంలోని జనవిజ్ఞాన వేదిక. శాస్త్రవిజ్ఞానానికి సంబంధించిన దాదాపు 30 పుస్తకాలు రచించారు. అనేక దేశాల్లో పర్యటించి, అక్కడి వారితో చర్చించి, ఆ పరిజ్ఞానాన్నంతటినీ ప్రజలకోసం ఉపయోగిస్తున్న ప్రజాపక్షపాతి.
జ్యోతిష్కులకు, సనాతనవాదులకు గ్రహణం అపశకునం. గ్రహణం ఏర్పడితే.. చెడు కలుగుతుందని వారు ప్రచారం చేయడంలో ఎలాంటి నిజమూ లేదని ఈ పుస్తకం వివరిస్తుంది. గ్రహణం ఒక అసాధారణ సంఘటనే. అది చంద్రుడి శుక్లపక్షం, కృష్ణపక్షం లాంటిది కాదు. ఒక నిర్దిష్ట స్థలంలో 360 సంవత్సరాల తర్వాత ఒకసారి మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అంటే అంత అరుదైన సందర్భమది. ప్రస్తుతం ఒక్క సెకను కూడా తేడా రాకుండా గ్రహణాన్ని ముందుగానే కచ్చితంగా గణించవచ్చు. గ్రహణం ఎందుకు ఏర్పడుతుందనే విషయంలోనూ నేడు పూర్తి స్పష్టత ఉంది. గ్రహణాల సందర్భంలో సైన్సు రీత్యా మనం పాటించాల్సిన కంటి రక్షణ చర్యలు గురించి కూడా ఈ పుస్తకం వివరిస్తుంది. గ్రహణాల సమగ్ర సమాచారం ఇందులో ఉంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good