భారతదేశంలో అభివృద్ధి చెందిన సంక్లిష్ట మతదర్శన వ్యవస్ధ ఆయా మూల పురుషుల మీద విశ్వాసాల ఆధారంగా అభివృద్ధి చెందిన రకరకాల మతాలు, వాటితో ముడిపడిన రకరకాల దర్శనాలు వేటికవి వేరు వేరు విభాగాలనే భావం పండితులలో స్ధిరపడిపోయింది. భారతీయ దర్శన చరిత్ర రచయితలు వాటిని విడివిడి దర్శన విభాగాలుగా వివరించవలసి వచ్చింది. దీనివల్ల ఆయా కాలాలలో సంభవించిన భావచైతన్యాల ప్రభావాలు, వాటి ఆదాన ప్రదానాలను అర్థంజేసుకుంటూ చారిత్రక క్రమంలో సంభవించిన నిరంతర పరిణామంగా విశ్లేషించి వివరించడం సాధ్యంగానిపని అయిపోయింది. ఆయా మహాపురుషుల భావ చైతన్యాలను, విశ్వాసాల ముసుగు నుండి వెలికితీసి వారి దేశ కాల నేపథ్యాలతో అనుసంధానించి క్రమానుగత చైతన్యాన్ని సంభావించు కోగలిగితే రకరకాల దర్శనాలలో అంతర్ముఖంగా సాగిన ఏకోన్ముఖ భావపరిణామం ప్రస్ఫుటమవుతుంది. ఆ దిశగా సాగిన ఒక పరిమిత ప్రయత్న ఫలితమే ఈ ''గౌతమ బుద్ధుని సాంఘిక విప్లవం''. ''నడుస్తున్న చరిత్ర''లో 13 నెలలపాటు ధారావాహికంగా ప్రచురించిన వ్యాసాల ఆధారంగా ఇది తయారయింది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good