ఈ గ్రంథ రచయిత మైకేల్ కారిథెర్స్ బౌద్ధుడు కాదు. కాని బౌద్ధమతంలో విశేషమైన పరిజ్ఞానం కలిగినవాడు. బుద్ధుని జీవిత కథ ద్వారా బుద్ధధర్మాన్ని సుబోధకంగా వివరించాడు. బుద్ధుని జీవితంలోనూ ఆయన బోధనలనబడేవాటిలోనూ ఏది వాస్తవం, ఏది మిథ్య అన్నదాన్ని తర్కించాడు. అభూతకల్పనలు అవసరం లేకుండానే బౌద్ధధర్మం అన్నది ఎంత ఉన్నతమైనదో వివరించగలిగాడు. ఆచ్ఛాదనలూ ఆడంబరాలూ లేని బుద్ధుని తాత్వికత ఎంత మ¬న్నతమో గౌతమబుద్ధుడు వెల్లడిస్తుంది. |