గోమాత - భూమాత
గోవును తల్లిగా భావిస్తున్నాం. మాట్లాడలేని జంతువులలో అమ్మా అని పలికేది గోమాత. తల్లి మాదిరిగా సాకుతోంది. తల్లి, పిల్లలకు పాలిచ్చినట్లు గానే గోమాత పాలనిచ్చి రక్షిస్తోంది. మనం ముసలివారమైనా మనకు పాలు, పెరుగు, నేతులనందిస్తోంది. అందుకే గోమాత అంటున్నాం.
ప్రేమ, శాంతి స్వరూపిణిగా సాక్షాత్కరిస్తోంది. జనకమాతతో బాటు, మనకింకా ఇద్దరు తల్లులున్నారు. వారే గోమాత, భూమాతలు.
గో అంటే భూమి అని కూడ అర్థం. కృష్ణుడు పూర్ణావతారం. భాగవతం ప్రకారం విష్ణుని అవతారాలు 24. ఇందు పది మినహాయిస్తే మిగిలినవి అంశావతారాలు. అందొక అవతారం పృథు చక్రవర్తి. అతడే భూమిని చదును చేసి రాష్ట్రంగా, నగరాలుగా తీర్చిదిద్దినవాడు. అతడు భూమాతను గోమాతగా దర్శించాడు. స్వధర్మాన్ని దూడగా చేసి దేవతలందరూ తమ అభీష్ట సిద్ధిని పొందారు.
Pages : 136