గోర్కీ దృష్టిలో సర్వప్రపంచమంటే మానవ సంబంధాల ప్రపంచం. మనిషితనం నిండుకున్న ప్రపంచం. మానవీయ శక్తుల్ని అడ్డుకునే ప్రతిశక్తుల మీద విజయం సాధించగలిగే అచ్చమైన మానవుల ప్రపంచం. పరస్పర అవగాహనకు అడ్డు తగిలే వాటినీ, వివిధ జాతుల మధ్య, ప్రాంతాల మధ్య, అలముకునే కుసంస్కారాన్నీ తెగగొట్టగల ప్రపంచం. మొరటు పితృస్వామిక భావాలకూ, పైపై నాగరిక పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడే శక్తులున్న వాళ్ళ ప్రపంచం, సంప్రదాయక నీతి స్థానంలో ఆపేక్షలను పెంచే ప్రపంచం. సమాజంతో సంబంధాలు లేని వాళ్ళ బతుకుల్ని ఈసడించుకునే ప్రపంచం, బాధలూ, భయాలూ, కరువులూ, కాటకాలు లేని ప్రపంచం. ఈ ప్రపంచాన్ని చాటేవే ఈ సంపుటిలోని కథలు కూడా. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good