సువర్ణముఖి కథల్లో ఒక నాటకీయత ఉంటుంది. ఒకే సమయంలో భిన్నమైన స్థలాల్లో, భిన్నమైన మనుషుల మధ్య కథ నడుస్తూ ఉంటుంది. వేరు వేరు చోట్ల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అక్కడున్న మనుషుల మద్య చర్చలు జరుగుతూ ఉంటాయి. ఘటనలు, ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. వాటిని కలిపే ఒక ఏకసూత్రత ఉంటుంది. అది ఉద్యమం. అది పోరాటం.

ఒక కథ గాని, ఒక సాహిత్య ప్రక్రియ గాని, ఒక రచన గాని చదువుతున్నప్పుడు పాఠకులు తమ అనుభవంలోను, తమ జ్ఞానంలోను, తమ చైతన్యంలోను ఎన్నో విషయాలలోకి వెళ్లిపోవడం ఆ రచనతో పాటు మమేకమయ్యే ఒక సజీవత్వానికి దాఖలా అవుతుంది. సువర్ణముఖి ఎప్పుడూ ఒక వాతావరణం, ఒక దృశ్యం, ఒక సంఘటన లేకుండా మనముందు ఒక సత్యాన్ని ఆవిష్కరించడు. - వివి

పేజీలు : 189

Write a review

Note: HTML is not translated!
Bad           Good