ఒక ఇంగ్లిషు మత ప్రచారకుడు హిందూమతాన్ని, హిందూసంఘాన్ని దుయ్యబడుతూ పత్రికలలో వ్యాసంప్రకటించగా, ఆ వ్యాసం చదివి గోరా మండిపడ్డాడు. స్వపక్షమునే సమర్ధిస్తూ గ్రంథం పూర్తిచేశాడు. ఆ గ్రంధంలో "మనదేశాన్ని విదేశీ న్యాయస్థానంలో నిలిపి, విదేశీ న్యాయసూత్రాల ప్రకారంవిచారించడానికి మనం నిరాకరించాలి. కీర్తి అపకిర్తుల విషయంలో మన భావాలు అడుగడుక్కూ విదేశీ కొలబద్దతో కొలిచే విధానం మీద ఆధారపడి వుండగూడదు. మన మాతృభూమి విషయంలో సాంప్రదాయాలు, విశ్వాసాలు, శాస్త్రాల విషయంలో ఇతర్లకుగాని మనకు మనంగాని క్షమాపణ చెప్పుకునే
దుస్థితికీ దిగజారకూడదు" గోరా మనసు ఇటువంటి భావాలతో నిండిపోయింది.
ఇంతటి ఉన్నతమైన అభిప్రాయాలను ఏర్పరచుకని సనాతన సంప్రదాయాలకు గౌరవిస్తూ, ఆచార
వ్యవహారాలను ఖచ్చితంగా పాటిస్తూ అటు విదేశీయులని, ఇటు బ్రహ్మ సామజికులని
అసహ్యించుకొనే గోరా తన అభిప్రాయాలను ఎందుకు మార్చుకోవలసి వచ్చింది?
చదవండి! విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి అద్భుత  నవల..... "గోరా"

Write a review

Note: HTML is not translated!
Bad           Good