తాళపత్రాలలో నిక్షిప్తమైయున్న తెలుగువారి సనాతన సంప్రదాయ శాస్త్రీయ సంస్కృతి విశ్వాసాల సమాహార 'గోపురం'.  మా పూర్వికులు ఎన్నో సంప్రదాయములు ఏర్పరచినారు. అలానే ఆచారములు కూడా మన జీవితంలో ఒక భాగముగా చేసియున్నారు. నిత్యజీవితంలో ఆచారములలోనూ, వ్యవహారములోనూ జీవన విధానములోనూ ఎన్నో మార్గదర్శకాలని నిర్దేశి౦చినారు. పూర్వకాలములో మహర్షులు అనేక ఆచారములు, సంప్రదాయములు, వ్యవహారములను, విషయములను తాటాకుల మీద వ్రాసి పొందుపరచినారు. ఇలాంటి ఎన్నో విషయములు కాల క్రమేణా మరుగున పడిపోతున్నాయి. మన తాతలు తండ్రులు కొన్ని విషయములు అందించేవారు. కానీ ఈరోజు పరిస్థితి ఎక్కడా కనబడలేదు. కేవలము టి.వి. మీడియాకు ప్రాముఖ్యతయిస్తున్నారు. తెలుసుకోవాలని ఆశలేదు. తెలుపవలసిన వారు మనకు తగ్గిపోవుచున్నారు. ఈ విధముగా మన సత్యాలను గ్రహించలేక పోవుచున్నాము. కావున ఎంతో మంది పెద్దలు, పీఠాధిపతులు, గురువులు అందించిన విషయములను పుష్పమాలగా అందించుచున్నాము. ఇంతకుముందు ఎన్నో తాళపత్ర గ్రంథములు వచ్చినవి. కాని ఈ గ్రంథములో ఉన్న సమాచారము మరి ఏ గ్రంథములో లభించదు. ఇందులో అతిశయోక్తి లేదు. వెయ్యినూటపదహారు పైగా విషయాలు అందించబడుతున్న ఏకైక గ్రంథము. కావున పాఠకులు ఈ గ్రంథమును మంచి విజయమును అందించగలదని ఆశిస్తున్నాము.

Write a review

Note: HTML is not translated!
Bad           Good