ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది జనం డాక్టర్‌ డేవిడ్‌ జే.ష్వార్ట్జ్‌ రచించిన గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు చదివి తమ జీవితాలను మెరుగు పరచుకున్నారు. ప్రముఖ ప్రేరణ నిపుణుడు డాక్టర్‌ ష్వార్ట్జ్‌ ఆదర్శమైన ఉద్యోగం ఎలా సంపాదించుకోవాలో, ఆస్తిపాస్తులను ఎలా సమకూర్చుకోవచ్చో, అన్నిటికన్న ముఖ్యంగా సుఖశాంతులతో నిండిన జీవితం ఎలా గడపాలో మీకు తెలుపుతారు.

గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు మీకు పనికివచ్చే పద్ధతులను వివరిస్తుంది. లేనిపోని ఆశలు కల్పించదు. మీ వృత్తిలో, మీ కుటుంబ జీవితంలో మీ సమాజంలో విజయం సాధించడానికి డా||ష్వార్ట్జ్‌ తాను జాగ్రత్తగా రూపొందించిన ప్రణాళికను మన ముందుంచారు. గొప్ప విజయం సాధించడానికి సహజసిద్ధమైన ప్రతిభ కాని, మేధా సంపత్తి కాని ఉండనవసరం లేదని, కేవలం ఆలోచించే అలవాటుండి, లక్ష్యం చేరుకోవడానికి అవసరమయే ధోరణి అలవరుచుకుంటే చాలని ఆయన నిరూపిస్తారు. ఈ పుస్తకం ఆ రహస్యాలను మీకు అందిస్తుంది. గెలుస్తానన్న విశ్వాసం మిమ్మల్ని గెలిపిస్తుంది. ఓడిపోతానన్న భయాన్ని పోగొట్టుకోండి. సృజనాత్మకంగా ఆలోచించి కలలు కనండి. మీ ఆలోచనలే మిమ్మల్ని రూపొందిస్తాయి. మీ భావాలను మీ స్నేహితులుగా చేసుకోండి. సానుకూలంగా ఆలోచించడం నేర్చుకోండి. ఓటమిని గెలుపుగా మార్చుకోండి. ఎదగడానికి లక్ష్యాలను ఉపయోగించుకోండి. నాయకుడిలా ఆలోచించండి. డా||డేవిడ్‌ జే.ష్వార్ట్జ్‌ అట్లాంటాలోని జార్బియా స్టేట్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌. నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకేనే శిక్షణా సంస్ధ క్రియేటివ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌కు అధ్యక్షుడు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good