'వందేళ్ళ తెలుగు కథ' క్రమ వికాసంలోని సంపూర్ణ పరిణితి గోపిని కురుణాకర్ 'భారతం బొమ్మలు' కథలో చూడాలి. ఇందులో కథాశిల్పం గురజాడ 'మీ పేరేమిటి' శిల్పం వంటిది. ఎత్తుకున్న నైతిక సమస్య రెండు సామాజిక యథార్ధాల ద్వంద్వనీతి సమస్య. ఆ విధంగా చింతా దీక్షితులు, వట్టికూట ఆళ్వారుస్వామి, కాళీపట్నం రామారావు, కేశవరెడ్డి చెప్తూ వచ్చిన సమస్య ఇది. చిత్రించిన వస్తువు దళిత జీవితం. కాని ఈ కథ ఒక గ్రామీణ కథ లేదా ఒక సామాజిక నైతిక కథ లేదా ఒక దళిత కథ మాత్రమే కాదు. ఇది ఒక సౌందర్యం గురించిన కథ కూడా. - వాడ్రేవు చినవీరభద్రుడు
ఇవి దీపాలు చెప్పుకునే ముచ్చట్లు. అంటే ఆడోళ్ళ ముచ్చట్లు. బ్యాక్యార్డ్ ముచ్చట్లు. ఈ ముచ్చట్లలో ఒక గాసిప్ ఉంటుంది. మన పంచతంత్ర కతల్లో కథా సరిత్సరాగాల్లో ఒక టాల్స్టాయ్లో సందడించే చిక్కటి రూపపరమైన ముచ్చట్లు. ఈ ముచ్చట్లు తుంపర కతల్లో అలవోకగా కరుస్తూనే ఉంటుంది. మన మందెచ్చులోల్ల కతల్లో, చిందు భాగోతాల్లో, కాటమయ్యకతల్లో, గొల్లసుద్దుల్లో ఉండే ముచ్చట్ల ప్రవాహమిది. సామెతల సాలు ఇది. బైరూపులొల్ల, శార్థకాన్ల, దాసరోల్ల, గంగిరెద్దులొల్ల, ఎర్రగొల్లోల్లలాంటి సంచారజీవుల కళారూపాల తాలూకు ఎస్సెన్స్ ఈ కతల్లో మనల్ని ఒక ఆధ్యాత్మికమైన డిస్కోర్స్లోకి తీసుకుపోతుంది. ఈ కతలన్నింటిలో జానపద సంగీతం తాలూకు 'రామిక్స్' దరువేస్తుంది కూడా. - సిద్ధార్థ
Rs.150.00
Out Of Stock
-
+