కథా, నవలా రచయితగా ప్రముఖుడైన గోపీచంద్‌ 30-50 దశకాల మధ్యకాలంలో కొన్ని తెలుగు సినిమాలకు కథల్ని అందించారన్న విషయం కొందరికే తెలుసు. అంతేకాక ఆయన లక్ష్మమ్మ, పేరంటాలు, ప్రియురాలు లాంటి సినిమాలకు దర్శకత్వం కూడా వహించారని తెలిసి, ఆశ్చర్యపోతాం. ఈ సంపుటిలో ఆయన రాసిన రైతుబిడ్డ, గృహప్రవేశం, లక్ష్మమ్మ, సినిమా కథలు, పాటలూ ఉన్నాయి. - ఆంధ్రజ్యోతి

సినిమాలకి రాయడం - అందునా ఉన్నతమైన కళావిలువలు, మానవతా సౌరభాలు, ఉదాత్తమానవ సంబంధాల చిత్రీకరణ ఉండిన ఆ రోజుల్లో కమర్షియల్‌ కూడా సక్సెస్‌ అయ్యేలా సినిమా రచన చేయడం, దర్శకత్వం వహించడం అసాధరణమైన సంగతే. గోపీచంద్‌ కథన నైపుణ్యానికీ, సంభాషణా వైవిధ్యానికీ ఈ మూడు చిత్రాల రచన అద్దం పడుతోంది. - ఈనాడు

గోపీచంద్‌ సినీ జీవితం సుమారు 20 ఏళ్ళు అనవచ్చు. ఆయన పేరు 1939 నుంచి 1963 వరకూ 9 చిత్రాలలో కనిపిస్తుంది. 1953లో ఆంధ్రరాష్ట్ర అవతరణతో ఆయన సినీ జీవితం చాలించి సమచార శాఖ అధికారిగా ప్రభుత్యోగానికి వెళ్ళారు. అంటే, రచనలో ఆయనకు పాలు ఉన్న కొన్ని చిత్రాలు ఆ తర్వాత విడుదల అయ్యాయి. ఆ 9 చిత్రాలో గోపీచంద్‌ 'డైరెక్టరు' అని చూపేవి మూడే లక్ష్మమ్మ, పేరంటాలు, ప్రియురాలు. గృహప్రవేశంతో కలిపి మొత్తం నాలుగు చిత్రాలూ ఆయన ప్రతిభా ప్రజ్ఞలకు సాక్ష్యాలు. గోపీచంద్‌ సంతానం సత్ప్రయత్నాన్ని సినీ అభిమానులు, సాహిత్యాభిమానులు ప్రోత్సహిస్తారని ఆశిస్తాను. - ఇండియాటుడే

Write a review

Note: HTML is not translated!
Bad           Good