చదువులో ఛాంపియన్‌ కావడమెలా?
అంధం తమ ప్రవిశన్తి యే2విద్యాముపాసతే|
తతో భుయ ఇవ తేతమోయ విద్యాయాం రతా||    ఈశ ఉపనిషత్తు - 9
వుయ్‌ హ్యావ్‌ టు ఎడ్యుకేట్‌ ది చైల్డ్‌ టు సేవ్‌ హిమ్‌ ఫ్రమ్‌ ఎడ్యుకేషన్‌ : రూసో
విద్య గురించి ప్రాచీన భారతీయుల, యూరోపియన్ల ఆలోచనా విధానానికి పై మాటలు అద్దం పడుతున్నాయి. చదువు లేకపోవడం ఎంత ప్రమాదమో, కేవలం చదువుమాత్రమే ఉండటం అంతకన్నా ప్రమాదకరం అన్నది పై మాటల భావన.
విద్య అంటే కేవలం చదువు మాత్రమే అనే అభిప్రాయాన్ని మనలో నాటుకు పోయింది. ఎక్కువ మార్కులు తెచ్చుకునేవారు మంచి విద్యార్ధులు అనే అభిప్రాయం కూడా తల్లిదండ్రులలోనూ, విద్యార్ధులలోనూ నెలకొనివుంది. మంచి విద్యార్ధులకు మంచి మార్కులు వస్తాయి. కానీ, మంచి మార్కులు వచ్చినవారంతా మంచి విద్యార్ధులు కారు.
విద్య మనల్ని సమగ్ర మానవులుగా తయారు చేయగలగాలి. విద్య జ్ఞానంగా ఎదగాలి. అప్పుడు విద్యార్ధి మంచి విద్యార్ధిగా మారతాడు. పుస్తకం పట్టుకుని దానిలో పేజీల్ని అక్షరం అక్షరం బట్టీయం పట్టడం వల్ల అది సాధ్యం కాదు. ఎక్కువ మార్లుఉ వస్తాయేమోకాని, చక్కని మానవులుగా ఎదగటం సాధ్యం కాదు. మీతోపాటు మీ నేర్చుకునే మనస్తత్వం కూడా ఎదగాలి. అందుకు డాక్టర్‌ బి.వి.పట్టాభిరామ్‌ గారి ఈ పుస్తకం ప్రాతిపదిక అవుతుందని ఆశిస్తున్నాము.
పరీక్షలంటే భయం పోగొట్టడానికి, ప్రణాళికబద్దంగా చదువుకోవడానికి, చదువుతోపాటు విద్యార్ధులు ఏ విషయాలు నేర్చుకోవలో తెలుసుకోవడానికి ఈ పుస్తకం చక్కగా ఉపయోగపడుతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good