ఆమెకి చెల్లెలు గుర్తొచ్చి కళ్లలో నీళ్లు తిరిగాయి.
"తొందరపడి ప్రాణాలమీదికి తెచ్చుకుంది" భాధగా అనుకుంది మరోసారి.
"రోజా!” మృదువుగా పిల్చింది నిర్మల. అంత మృదువుగా పిల్చినా ఆమె తృళ్లిపడిచూసింది.
"ఏవిటమ్మా! అంత పరధ్యానంగా వున్నావ్!” కూతురి తల నిమురుతూ అంది నిర్మల.
"ఎందుకో ఇవాళ హనీ బాగా గుర్తొస్తోందమ్మా!" బేలగా అంది రోజా.
నిర్మల కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి.
"ఇంక దాన్ని గురించి బాధపడొద్దు రోజా!... అది ఎక్కడో క్షేమంగా వుందనిపిస్తోంది. ఆ నమ్మకంతోనే బతుకుతున్నను. మీరూ అలాగే అనుకోండి" అంది దఃఖాన్ని తొక్కిపెట్టాలని ప్రయత్నిస్తూ.
"డాడీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్నాడా!” మాట మారుస్తూ అంది రోజా.
"లేదు నువ్వు రా" అంది నిర్మల కళ్లు తుడుచుకుంటూ తల్లీ కూతుళ్లిద్దరూ డైనింగ్టేబిల్దగ్గరకొచ్చారు.
అప్పటికే అక్కడకొచ్చికూర్చున్నాడు డేవిడ్.
"ఒంట్లో ఎలా వుంది డాడీ!” ఆప్యాయంగా అడిగింది రోజా.
"అయామ్" ఓకే థ్యాంక్యూ మై ఛైల్డ్!” అన్నాడతను నీరసంగా నవ్వుతూ.
తండ్రిని అప్యాయంగా కిస్ చేసి వచ్చి అతనికెదురుగాకూర్చుంది రోజా.
"మీరూ దిగులుగా వుంటే పిల్లలు మరీ కంగారు పడుతున్నారు. ప్లీజ్! మీరు నార్మల్‌గా వుండండి" అతని జాకెట్ మస్లర్ సరిచేస్తూ అంది నిర్మల.

Write a review

Note: HTML is not translated!
Bad           Good