అనువాదం అనేది ఒక కళ. అది ఒక శాస్త్రం. ఇంకా చెప్పాలంటే అదొక కళాత్మక శాస్త్రం. శాస్త్రీయమైన కళ. మరి అనువాదంలో ఏముంటుంది? మూలంలో వున్న వస్తువు లక్ష్యభాషా పాఠకులకు అర్థమయ్యే విధంగా అనువాదంలో ఒదిగిపోతుంది. ఇంతకీ మూలభాషలోని వస్తువూ, ద్రవ్యమూ ఎక్కణ్ణించి వస్తాయి? ప్రాచీనకాలంలోనైతే దువుళ్ళూ, దేవతలూ, దయ్యాలూ, పురాణ పురుషులూ మొదలైనవాళ్ళు కథా వస్తువులుగా, కావ్య వస్తువులుగా వుండేవాళ్ళు. ఆధునిక అయుగంలో వస్తువు మారిపోయింది. దేవుళ్ళూదయ్యాల నుండి మనిషినీ, సమాజాన్నీ, చరిత్రనూ, జీవితాన్నే కేంద్రంగా చేసుకొని వస్తువు మార్పుకు గురైంది. గోలకొండ పత్రిక’’ అనువాద కథల్లోనూ అందుకే మానవుడు కన్పిస్తాడు. విచిత్రమైన మానవ మనస్తత్వం గోచరిస్తుంది. కొన్ని సందర్భాల్లో చారిత్రక సంఘటనలకు కథారూపాలు అగుపిస్తాయి. సమాహారంలో మొత్తం ఇరవై ఆరు కథలున్నాయి. ఇందులో యం.ఎస్‌.వీరయ్యవి ఆరు కథలున్నాయి. అందులో రెండిరటికి మాత్రమే మూలాలు చూపించినా, ఆరూ అనువాద కథలుగానే భావించాల్సి వుంటుంది....

పేజీలు : 170

Write a review

Note: HTML is not translated!
Bad           Good