గోదావరితో తమ జీవితాలు విడదీయరాని విధంగా పెనవేసుకుపోయిన అసంఖ్యాకులైన బడుగు జీవుల దృక్కోణం నుంచి చెప్పిన ఒక గొప్ప నది కథ ఇది. ఒక భావావేశంతో చెప్పిన ఈ కథ మీ మనస్సులను పట్టివేసి, పిండివేసి, దిగ్భ్రాంతికి గురిచేసి, సిగ్గుపడేట్లు కూడా చేస్తుంది. ఆ నది, దానితో పాటు అది నడిపి నిలిపే జీవన వ్యవస్థలు విధ్వంసమవుతున్న తీరు మనకిందులో కనిపిస్తుంది. సుమారు 300 గ్రామాలు ప్రణాళికా బద్దంగా, శాశ్వతంగా నీట మునగనున్న చిత్రమిది. ఏ రక్షణలూ లేని సామాన్య భారతీయులు కొందరు బహుశా గతంలో ఎప్పుడూ లేనంతటి స్థాయిలో ముంపుకు గురై శాశ్వతంగా నిర్వాసితులు కానున్నారు. అనేకానేక అంశాలు ఇమిడి ఉన్న ఈ మొత్తం క్రమాన్ని ఉమామహేశ్వరి ఒక స్పష్టమైన దృక్పథంతో వివరించారు. ఆ వివరణలో గొప్ప పరిశోధనతోపాటు కథాకథనంలో ఒక కొత్తదనం ఉంది.

- పి.సాయినాథ్‌

ఎవ్రిబడీ లవ్స్‌ ఎ గుడ్‌ డ్రౌట్‌ గ్రంథ రచయిత

పేజీలు : 400

Write a review

Note: HTML is not translated!
Bad           Good