కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథ లకు రూపకల్పన జరిగింది. ప్రజల్ని వణికిస్తూ పంటపొలాల్ని ఇసుకమేటలుగా మార్చి, నిండు ప్రాణాల్ని పొట్టనపెట్టుకున్న గోదావరి ఉగ్ర రూపాన్ని హృద్యంగా చిత్రించారు. కంచనపల్లి, గుర్రపుతండా, తాడవాయి మొదలైన గిరిజన గ్రామాల స్వరూపం, నేపథ్యం, ప్రజల స్థితిగతులు, సంభాషణలు, పాలకుల నుండి ఆశిస్తున్న సదుపాయాలు వంటి అంశాలెన్నో స్మృతిపథానికి తగులుతాయి. ఆయా గాధల్లో జీవిత రేఖలకు ప్రతీకలుగా కన్పిస్తాయి. గోండతండాలు, కోయగూడాల్లోని జీవితాలకు దర్పణం ఈ గాధలు. - ఈనాడు |