హిందీ నవలా సాహిత్యానికి ప్రేమ్‌చంద్‌ మకుటంలేని మహారాజు. ఈ కీర్తిశేషుడు రాసిన నవలల కన్నింటికీ మకుటం లాంటిది గోదాన్‌.

మన భారతదేశంలో సామాన్య వ్యక్తి రైతు; సామాన్య జీవితానికి కొలతబద్ధ రైతు జీవితం. ఈ గోదాన్‌ నవలకి మూలాధారం ఒక సామాన్య రైతు, అతని భార్యాబిడ్డలు, కోడళ్ళు, అల్లుళ్ళు. అతని గ్రామీణ జీవితానికి అడ్డుకట్టలు కట్టి నిరోధించాలనీ, పూడ్చివెయ్యాలనీ ప్రయత్నించే ఊరిపెద్దలు, జమీందారు గూడా సజీవంగా కన్పిస్తారు మనకీ నవల్లో.

మనదేశం ఈ శతాబ్దంలో అడుగుపెట్టి, దాటివచ్చిన ఐదు దశాబ్దాలూ ఈ గోదాన్‌లో అడుగడుగునా ప్రతిబింబించుతుంటాయి; ఐదు దశాబ్దాల రైతు జీవిత భూత భవిష్యద్వర్తమానాలు ఈ మూడు వందల పేజీలలోపు గ్రంథంలో సాక్షాత్కరిస్తాయి; అంత జీవితాత్మకం ఈ నవల. జీవితాన్ని అంతగా కాచితరచాడు ప్రేమ్‌చంద్‌.

బూజుపట్టిన భూస్వామ్య వ్యవస్థలోపడి, సాలిగూళ్ళలో చిక్కుకుని మనదేవంలో రైతు క్రమక్రమేణా ఎలా ఎందుకు కూలిబ్రతుకు వెళ్ళబోయవలసి వస్తుందో విశదీకరిస్తుంది ఈ గోదాన్‌; ఈ అంత:ర్దృష్టే ఈ నవలకు అంతర్వాహిని.

పేజీలు : 288

Write a review

Note: HTML is not translated!
Bad           Good