డా. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గొప్పమేధావి. విభిన్నమైన అంశాలను గాఢంగా పరిశీలించి సమాచారం, హేతుబద్ధత, స్పష్ట లక్ష్యాల ఆధారంగా తన పరిశోధనలను వెల్లడించాడు. ఈ చిన్న పుస్తకంలో డా. అంబేద్కర్, స్కోత్కర్ష భావంలేకుండా మానవ అస్తిత్వానికి గల విభిన్న కోణాలను ఆలోచించి, చర్చించి, ప్రకటించిన విధానాన్ని మనం గమనించగలం. ఆయన వివేచన, నిష్పాక్షికమైన హేతబద్ధత గొప్పతనాన్ని ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సమన్వయం, బాధ్యత, హేతుబద్ధతలను గూర్చి ఆయన ''బాధ్యత అనేది సమన్వయం కంటే ముఖ్యమైంది. బాధ్యతాయుతుడైన వ్యక్తి తనకున్న విషయ పరిజ్ఞానాన్నంతా వదలివేయటం నేర్చుకోవాలి. తన ఆలోచనలను పునర్నవీకరించుకునే ధైర్యాన్ని ప్రదర్శించాలి. కొత్తగా ఆలోచించాలి. తాను గడించిన విషయ పరిజ్ఞానాన్ని వదలివేయటానికి తగిన కారణాలున్నప్పుడే కదా ఇది సంభవిస్తుంది. ఆలోచనా విధానానికి చివరిదశ అనేది ఉండదు.''
పేజీలు : 70