సైన్సు పుస్తకాలకూ, కుహనా, సైన్సూ రచనలకూ ఉన్న ప్రధాన వ్యత్యాసం ఖచ్చితత్వం. వెంకట్రావు వ్యాసాల్లో పొల్లుపోని సైన్సురిగర్, సైన్సువిగర్ ఉంటాయి. గతితార్కిక భౌతికవాదానికి విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలూ, రుజువులూ ఆయువుపట్లు. సకల దుర్గంద భూరిత అశాస్త్రీయ వ్యాకులంతో పాఠకలోకాన్ని అతలాకుతలం చేస్తున్న ఆధునిక గజబిజి సాహిత్యపు చీకట్లను పారద్రోలి, ప్రజానీకాన్ని, 'తమసోమా జ్యోతిర్గమయ' అంటూ వెలుగులోకి నడిపేందుకు దూసుకొస్తున్న సూర్యకిరణాలనూ, మెరుపు తీగలనూ వెంకట్రావు గారు జ్ఞానం - విజ్ఞానం ద్వారా వెదజల్లుతున్నారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good